లక్ష్యసేన్ కుమమోటో మాస్టర్స్, NewzFast Telugu (జపాన్): భారత బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ జపాన్‌లో జరుగుతున్న కుమమోటో మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో రెండో రౌండ్‌కు చేరాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌గా ఉన్న లక్ష్యసేన్ చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌పై విజయం సాధించాడు.
ఈ మ్యాచ్ 21-19, 21-18 స్కోర్లతో నేరుగా గేమ్స్‌లో ముగిసింది. మొత్తం 68 నిమిషాల పాటు కొనసాగిన ఈ పోరులో లక్ష్యసేన్ ఆధిపత్యం చూపించాడు.
అతను ఇటీవల జర్మనీలోని హైలో ఓపెన్‌లో టైటిల్ గెలుచుకున్న విషయం గమనార్హం.
ఇదే టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా విజయం సాధించాడు. డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ జెంక్ను 18-21, 21-16, 24-22 స్కోర్లతో ఓడించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు.
మొదటి గేమ్ కోల్పోయినప్పటికీ తిరిగి పుంజుకుని విజయం సాధించాడు.
శ్రీకాంత్ మ్యాచ్ ఒక గంట ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది. మరోవైపు భారత డబుల్స్ జోడీలు ధృవ్ రావత్ – కే మణీషా, హరిహరన్ అమ్సకరుణన్ – తానిషా క్రాస్టో ఓటమి పాలయ్యాయి.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ 13వ స్థానంలో, చి యు జెన్ 24వ స్థానంలో ఉన్నారు.




