యుగంధర్ గౌడ్‌పై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో 270 మంది ఎక్సైజ్ ఎస్‌ఐల ఫిర్యాదు

యుగంధర్ గౌడ్: బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తమపై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ 2020 బ్యాచ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు బుధవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు 270 మంది ఎక్సైజ్ ఎస్‌ఐలు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీన బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ మరియు 2020 బ్యాచ్.

యుగంధర్ గౌడ్, NewzFast Telugu (హైదరాబాద్): బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తమపై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ 2020 బ్యాచ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు బుధవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు 270 మంది ఎక్సైజ్ ఎస్‌ఐలు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 7వ తేదీన బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ మరియు 2020 బ్యాచ్ ఎస్ఐలపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఎస్ఐల శిక్షణ కాలాన్ని చట్టవిరుద్ధంగా కుదించారని, అందుకుగానూ కమిషనర్ ఒక్కో ఎస్ఐ వద్ద నుంచి రూ. 30,000 వసూలు చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వారు పూర్తిగా అవాస్తవమని, ఆధారరహితమని స్పష్టం చేశారు.

తమ శిక్షణ కాలానికి సంబంధించిన అంశం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందని వారు గుర్తుచేశారు. యుగంధర్ గౌడ్ వ్యాఖ్యలు తమను తీవ్ర మనోవేదనకు గురిచేయడమే కాకుండా, కమిషనర్, ఎస్ఐల ప్రతిష్టకు భంగం కలిగించే దురుద్దేశంతో కూడుకున్నవని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులను, సిబ్బందిని ఆయన నిరంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, ఎస్ఐల విధులకు ఆటంకం కలిగిస్తూ ఆఫీసు కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు