అనిరుధ్ కావ్యా మారన్ వివాహం, NewzFast Telugu (గ్రీస్): ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఓ ఇంటివాడయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ సహ యజమాని కావ్యా మారన్‌తో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు.
బుధవారం (నవంబర్ 11) గ్రీస్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.
ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
గ్రీస్‌లో బీచ్ వెడ్డింగ్‌ల తరహాలోనే ఈ వివాహం కూడా వైభవంగా జరిగింది.
పెళ్లి అనంతరం అనిరుధ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఫొటో పంచుకున్నారు. కావ్యతో కలిసున్న ఫొటోకు “మై వన్స్ ఇన్ లైఫ్ టైమ్..
ఫర్ ఏ లైఫ్ టైమ్” అంటూ క్యాప్షన్ ఇచ్చి, లవ్ ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.
ఈ వివాహానికి కలానిధి మారన్, అనిరుధ్ కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. రజనీకాంత్, లతా రజనీకాంత్, ఎం.కె.
స్టాలిన్, దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ సహా పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
వివాహం అనంతరం నవంబర్ 21న చెన్నైలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని, టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు వెళ్లనున్నారని తెలుస్తోంది.




