నల్గొండలో నవంబర్ 15 నుంచి అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు

అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు: 2026 నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండ జిల్లాలో జరగనున్న 36వ జాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుంచి లక్ష మంది రైతులు హాజరుకానున్నారని రైతు సంఘం నాయకులు తెలిపారు. కార్పొరేట్ దోపిడీ నుంచి రైతుల భూములను కాపాడాలని, పంట నష్టపరిహారం డిమాండ్లను ముందుకు తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు.

అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు, NewzFast Telugu (నల్గొండ): 1936లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ 36వ మహాసభలను నల్గొండలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని రైతు సంఘం నాయకులు తెలిపారు.

2026 నవంబర్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉద్యమాల గడ్డ, తెలంగాణ సాయుధ పోరాట ఖిల్లా అయిన నల్గొండ జిల్లాలో ఈ మహాసభలు జరగనున్నాయి. దేశ నలుమూలల నుంచి లక్ష మంది రైతులు హాజరుకానున్నారు.

నవంబర్ 15వ తేదీన ఎంజీ గ్రౌండ్ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సీపీఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్ హాజరుకానున్నారు.

నారాయణపేట జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గుండెగారి దస్తప్ప మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో అనావృష్టి కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై నష్టపోయారని తెలిపారు. వారికి ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25 వేల చొప్పున పంట నష్టపరిహారం ప్రకటించాలని కోరారు.

అలాగే ఈ జిల్లాలో జీవో 69 కింద సాగు, తాగునీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కోటకొండ గ్రామంలో గోడపత్రికలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు