రాజ్ తరుణ్ టార్టాయిస్, NewzFast Telugu: రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’ నుంచి ‘రంగు రంగు పిల్లరో’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.
దర్శకుడు రిత్విక్ కుమార్ ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో సినిమాపై సానుకూల ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘రంగు రంగు రంగు పిల్లరో..’ పాటకు అనూప్ రూబెన్స్ ఎనర్జిటిక్ ట్యూన్ సమకూర్చగా, ప్రముఖ జానపద గాయకుడు, కవి పెంచల్ దాస్ లిరిక్స్ రాసి పాడారు.
‘మేడలోన పిల్లవో హో హో, మేడివారి పల్లెలో హో హో’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. పాటలో అనూప్ రూబెన్స్, పెంచల్ దాస్ ఇద్దరూ ప్రదర్శన ఇవ్వడం విశేషం.




