ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల పసికందు మృతి, వైద్యుడి నిర్లక్ష్యమని తల్లిదండ్రుల ఆరోపణ

కోహీర్ ప్రైవేట్ ఆసుపత్రి చిన్నారి మృతి: ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ రెండు నెలల పాప మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. తండ్రి రియాజ్ తెలిపిన వివరాల ప్రకారం, రెండు రోజుల క్రితం తన రెండు నెలల కుమార్తె మెహర్ ఉన్నీసా అస్వస్థతకు గురైంది. దీంతో భార్యతో కలిసి చిన్నారిని కోహీర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు చిన్నారిని పరీక్షించి జలుబు చేసిందని చెప్పి.

కోహీర్ ప్రైవేట్ ఆసుపత్రి చిన్నారి మృతి, NewzFast Telugu (సంగారెడ్డి జిల్లా, కోహీర్): ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ రెండు నెలల పాప మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

తండ్రి రియాజ్ తెలిపిన వివరాల ప్రకారం, రెండు రోజుల క్రితం తన రెండు నెలల కుమార్తె మెహర్ ఉన్నీసా అస్వస్థతకు గురైంది. దీంతో భార్యతో కలిసి చిన్నారిని కోహీర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యుడు చిన్నారిని పరీక్షించి జలుబు చేసిందని చెప్పి, తాగేందుకు టానిక్ ఇచ్చారు.

వైద్యుడి సూచన మేరకు మందులు వాడినప్పటికీ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడకపోగా పరిస్థితి మరింత క్షీణించింది. బుధవారం మధ్యాహ్నం చిన్నారిని మరోసారి అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుడు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

దీంతో తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన జహీరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తండ్రి రియాజ్ కోహీర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తమ బిడ్డ మరణానికి కారణమైన వైద్యుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు