అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎంకోర్ ఓటీటీ, NewzFast Telugu: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన రీసెంట్ విజువల్ వండర్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ దగ్గర ఉన్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఐమాక్స్, 4DX, MX4D, డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ చేయడంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది.
భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
ఇప్పుడు ఈ శుక్రవారం (నవంబర్ 13) నుంచి ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంటుందని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజ్ నిర్మించగా, ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. కథ విషయానికొస్తే, థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనమవుతుంది.
మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది.
థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇంటి నుంచే చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.




