ముళ్లపంది మాంసం విక్రయం, NewzFast Telugu (తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం): కమ్మర్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలోని మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ముళ్లపంది మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ అధికారి బి.
అరుణ్‌కుమార్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామానికి చెందిన సింగజోగి కిషన్, మిట్ట సునీల్ తిమ్మాపూర్ గ్రామంలోని ఈతవనం వద్ద ముళ్లపంది మాంసం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ముళ్లపంది మాంసంతో పాటు ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బి. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడినా, చంపినా, వాటి మాంసాన్ని విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మోర్తాడ్ డిప్యూటీ అటవీ శాఖ అధికారి ఎ. చంద్రశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.




