హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, NewzFast Telugu (హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా): ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. గంగాధర్ తెలిపారు.
ఇందులో భాగంగా కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బెల్టులు, గుర్తింపు కార్డులు, షూస్ పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రిన్సిపాల్ సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యా వాతావరణం, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలపై నమ్మకంతో తమ పిల్లలను చేర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఎస్.
రాజు, ఎస్. సత్యనారాయణ, వి.
సదాశివ్, బి. ఎల్లయ్య, వెంకటముత్యం, విద్యాసాగర్, చంద్రమోహన్, రణధీర్ కుమార్, సీహెచ్.
రాజిరెడ్డి, ఏ. మమత, గ్రంథపాలకులు ఆర్.
వాసవి, వెంకటసాయి, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.




