జుక్కల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతన కమిటీ ఏర్పాటు

జుక్కల్ టీఆర్‌పీ నూతన మండల కమిటీ: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నూతన మండల కమిటీని నియమించినట్లు పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్, ఇంచార్జి జాదవ్ ఈశ్వర్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీలో అధ్యక్షుడిగా బండివర్ రాజు, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, జుక్కల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా అందులాగిరి దత్తు బాధ్యతలు చేపట్టారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి.

జుక్కల్ టీఆర్‌పీ నూతన మండల కమిటీ, NewzFast Telugu (జుక్కల్, కామారెడ్డి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నూతన మండల కమిటీని నియమించినట్లు పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్, ఇంచార్జి జాదవ్ ఈశ్వర్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నూతనంగా ఏర్పడిన కమిటీలో అధ్యక్షుడిగా బండివర్ రాజు, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, జుక్కల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా అందులాగిరి దత్తు బాధ్యతలు చేపట్టారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తామని నాయకులు తెలిపారు.

బీసీలకు రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో పోరాడుతున్న తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలుస్తూ, పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి అందరి సమన్వయంతో పార్టీని బలోపేతం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు రాజ్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు