రైలు ఏసీ బోగీలో కుటుంబం శాండ్‌విచ్‌లు తయారు చేసిన వీడియో వైరల్

రైలు ఏసీ కోచ్ శాండ్‌విచ్ వీడియో: రైలు ప్రయాణాల్లో చిరుతిళ్లు తినడం సర్వసాధారణమే. అయితే ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బోగీని వంటగదిలా మార్చి చిరుతిళ్లు తయారు చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఈ దృశ్యం 3 టైర్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని మధ్య బెర్త్‌తో పాటు పక్కనే ఉన్న సీట్లను తమకు అనువుగా వినియోగించుకుంది. ఆ కుటుంబంలోని మహిళలు మధ్య బెర్త్‌పై తొలుత పేపర్లు పరిచారు. ఆ తర్వాత వాటిపై.

రైలు ఏసీ కోచ్ శాండ్‌విచ్ వీడియో, NewzFast Telugu (భారతదేశం): రైలు ప్రయాణాల్లో చిరుతిళ్లు తినడం సర్వసాధారణమే. అయితే ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బోగీని వంటగదిలా మార్చి చిరుతిళ్లు తయారు చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఈ దృశ్యం 3 టైర్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని మధ్య బెర్త్‌తో పాటు పక్కనే ఉన్న సీట్లను తమకు అనువుగా వినియోగించుకుంది.

ఆ కుటుంబంలోని మహిళలు మధ్య బెర్త్‌పై తొలుత పేపర్లు పరిచారు. ఆ తర్వాత వాటిపై బ్రెడ్ స్లైస్‌లు ఉంచి, కూర ముక్కలు, చట్నీ వంటివి వేసి శాండ్‌విచ్‌లు తయారు చేశారు.

ఈ క్రమంలో ఎలక్ట్రిక్ టోస్టర్ తెచ్చి ఉంటే బాగుండేదని వారిలో ఓ మహిళ వ్యాఖ్యానించారు.

ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. రైలు బోగీని అలా కిచెన్‌లా మార్చడం సరికాదని, భారతీయుల్లో పౌర స్పృహ పెరగాల్సిన అవసరం ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు.

మరికొందరు మాత్రం బెర్తులు పాడుకాకుండా పేపర్లు పరిచి పని చేసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమని పేర్కొన్నారు.

టోస్టర్ తీసుకురావాలన్న వ్యాఖ్యపై కొందరు విమర్శలు చేశారు. రైల్లో వంటలు చేసుకుంటే అగ్నిప్రమాదాలు జరిగి ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, ఈ కీలక విషయం తెలియకపోవడం విచారకరమని వారు అన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు