సంక్రాంతి రైలు టికెట్ బుకింగ్, NewzFast Telugu (భారతదేశం): సంక్రాంతి వచ్చిందంటే చాలు, నగరాలు ఖాళీ అవుతాయి. నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ సొంతూళ్లకు వెళ్తుంటారు.
కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి పండగ జరుపుకునేందుకు నగరాల నుంచి గ్రామాలకు క్యూ కడతారు.
దీంతో సంక్రాంతి సమయంలో నగరాల్లోని రోడ్లు బోసిపోయి వెలవెలబోతుంటాయి. మరో రెండు నెలల్లో సంక్రాంతి రానుండగా, తెలుగువారికి ఇది అత్యంత ముఖ్యమైన పండుగ.
సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం అవసరం.
సాధారణంగా నెల రోజుల ముందే టికెట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కావాలంటే అన్నీ బుక్ అయి కనిపిస్తాయి.
ఈ నేపథ్యంలో ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. సంక్రాంతికి టికెట్ల బుకింగ్ కోసం ముహూర్తం ఖరారైంది.
నవంబర్ 14 నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు.
రైల్వే నిబంధనల ప్రకారం 60 రోజుల ముందుగానే బుకింగ్ ప్రారంభమవుతుంది. జనవరి 15న సంక్రాంతి పండుగ కాగా, జనవరి 14న బోగి పండుగ ఉంది.
పండక్కి వెళ్లేవారు ఈ నెల 14 నుంచే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల టికెట్లు ఖాళీగా ఉండటంతో పాటు ప్రయాణం సులభమవుతుంది.
పండక్కి వెళ్లేవారు భోగికి ముందురోజు రాత్రి తమ సొంతూర్లకు చేరుకుంటారు. జనవరి 13న ప్రయాణించేవారు ఇప్పుడే నెల రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
జనవరి 15 సంక్రాంతి రోజున ఇంటికెళ్లాలనుకునేవారు జనవరి 14 తేదీకి బుక్ చేసుకోవచ్చు.
నవంబర్ 14 నుంచి సాధారణ రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లలో బుకింగ్ పూర్తయిన తర్వాత డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రకటించగానే వెంటనే రిజర్వేషన్లు మొదలవుతాయని, ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.




