జగదీప్ ధన్‌ఖడ్, NewzFast Telugu (న్యూఢిల్లీ): భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయినట్లు సమాచారం.
సుమారు కొన్ని నిమిషాల పాటు స్పృహ లేకుండా ఉండటంతో, వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను పీసీఆర్ (PCR) వాహనంలో నివాసానికి తరలించారు. అనంతరం ఐఎల్‌బీఎస్ (ILBS) వైద్య బృందం, ఎయిమ్స్ వైద్యులు సందీప్ సేథ్ ఇంట్లోనే ప్రాథమిక చికిత్స అందించారు.
ఎమర్జెన్సీ చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, ఆయనను వెంటనే అంబులెన్స్‌లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 75 ఏళ్ల ధన్‌ఖడ్‌ను ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్లో కార్డియాలజీ విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. దీనిపై ఎయిమ్స్ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
జగదీప్ ధన్‌ఖడ్ ఆగస్టు 2022 నుంచి జూలై 2025లో రాజీనామా చేసే వరకు భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.




