విజయసాయి రెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు

విజయసాయి రెడ్డి: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీపై విమర్శలు కురిపించారు. అది PRP కాదు AAP అపరివర్తన అవినీతి పార్టీ అని ఎద్దేవా చేశారు. ముందు విజయసాయి రెడ్డిలో పరివర్తన రావాలంటూ మండిపడ్డారు. రాజకీయాలు వదిలేస్తానని చెప్పి మళ్లీ దాచుకున్న డబ్బు రక్షణ కోసమే విజయసాయి రెడ్డి పార్టీ పెట్టారని కేఏ పాల్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఉన్న ఆస్తులు, దోచుకున్న సొమ్మును ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి.

విజయసాయి రెడ్డి, NewzFast Telugu: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీపై విమర్శలు కురిపించారు. అది PRP కాదు AAP అపరివర్తన అవినీతి పార్టీ అని ఎద్దేవా చేశారు.

ముందు విజయసాయి రెడ్డిలో పరివర్తన రావాలంటూ మండిపడ్డారు.

రాజకీయాలు వదిలేస్తానని చెప్పి మళ్లీ దాచుకున్న డబ్బు రక్షణ కోసమే విజయసాయి రెడ్డి పార్టీ పెట్టారని కేఏ పాల్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఉన్న ఆస్తులు, దోచుకున్న సొమ్మును ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

విజయసాయి రెడ్డి ఆస్తులపై సీబీఐ ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు.

80 ఏళ్లుగా 12 మంది రెడ్డి వర్గం నాయకులే పాలించారని, 60% పైగా ఉన్న బీసీలు, 27% ఉన్న కాపులకు అవకాశం ఏదని ఆయన ప్రశ్నించారు. బుద్ధిలేని బీసీలు, ఎస్సీ ఎస్టీలే విజయసాయి రెడ్డి పార్టీలో చేరతారని మండిపడ్డారు.

వైఎస్ జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు, ఇతర రాజకీయ శక్తుల కోసమే ఈ కొత్త పార్టీని ప్రకటించారని ఆరోపించారు. రెడ్డి వర్గాల ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలికి బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఏకం కావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు