ఏపీ మున్సిపల్ ఎన్నికలు, NewzFast Telugu (అమరావతి): కోర్టు వివాదాలు క్లియర్ కావడంతో పలు పురపాలక సంఘాలు మరియు నగరపాలక సంస్థలకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం నిర్ణయించింది. నవంబర్ 26వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి.
అదే రోజు పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు 23 పురపాలక సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది.
నవంబర్ 13వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, పొన్నూరు, నర్సరావుపేట, బాపట్ల, కావలి, శ్రీకాళహస్తి వంటి మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు.
ఈ ఎన్నికల కసరత్తును ఎస్ఈసీ ప్రారంభించింది. ఇటీవల రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు మరియు 92 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. కొన్ని చోట్ల న్యాయపరమైన వివాదాల కారణంగా ఎన్నికలు నిలిచిపోగా, ఇప్పుడు ఆ కేసులు క్లియర్ కావడంతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.




