అరసన్ ఫైర్ గ్లింప్స్, NewzFast Telugu: తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అరసన్’ నుంచి చిత్రబృందం తాజాగా కొత్త ‘ఫైర్ గ్లింప్స్’ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ గ్లింప్స్‌లో శింబు మాస్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఫైర్..
ఫైర్.. ఫైర్..
దాస్ అన్నన్ వందాలే ఫైర్’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా, చేతిలో కొడవలి పట్టుకుని శత్రువులపై శింబు విరుచుకుపడే సన్నివేశాలు గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఈ గ్లింప్స్‌లో వినిపిస్తున్న పాట సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో శింబు సినిమాల్లో మంచి ఆదరణ పొందిన ‘మామా మామా మామా’ పాటను ఈ కొత్త ట్రాక్ గుర్తు చేస్తోందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మాస్ బీట్ ఈ వీడియోకు మరింత ఊపునిచ్చాయి. పాట పూర్తి వెర్షన్ విడుదలైతే మంచి స్పందన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్.థాను, గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ పతాకంపై మనీష్ షా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, వెట్రిమారన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, తాజా గ్లింప్స్‌తో ‘అరసన్’పై అంచనాలు పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.




