గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై కాంగ్రెస్ తర్జనభర్జన

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది. వచ్చేవారం పదవీకాలం ముగియనున్న మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావించినప్పటికీ, సామాజిక సమీకరణలు కుదరకపోవడంతో నిర్ణయం పెండింగ్‌లో ఉంచినట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను కలిపి ప్రకటించాలనే అభిప్రాయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది నేతలు పోటీలో ఉండగా, ఎస్సీ.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, NewzFast Telugu (తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది. వచ్చేవారం పదవీకాలం ముగియనున్న మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావించినప్పటికీ, సామాజిక సమీకరణలు కుదరకపోవడంతో నిర్ణయం పెండింగ్‌లో ఉంచినట్టు సమాచారం.

వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను కలిపి ప్రకటించాలనే అభిప్రాయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది నేతలు పోటీలో ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ వర్గాల నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో జాబితాను ముందుగా ప్రకటిస్తే, పదవులు దక్కని నేతల నుంచి అసమ్మతి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో, అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సమన్యాయంతో సీట్ల పంపకం చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం వాయిదా పడినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ కోటాలో ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉండగా, బీఆర్ఎస్‌కు ఒక స్థానం దక్కనుంది.

గవర్నర్ కోటాలోని మూడు స్థానాలతో కలిపి మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ పదవులను ఒకేసారి భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.

ఈ ఎనిమిది పదవుల్లో కనీసం మూడు బీసీ వర్గాలకు ఇవ్వనున్నట్టు తెలిసింది. అసెంబ్లీ కోటాలో పదవీకాలం ముగియనున్న వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్ రామిరెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ ఉన్నారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలాన్ని రెన్యూవల్ చేస్తామని పార్టీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బై ఎలక్షన్‌లో మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ అసెంబ్లీ కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే వారికి మూడేళ్ల పాటు మాత్రమే పదవీకాలం లభించడంతో, వారిద్దరి పదవులను మరోసారి రెన్యూవల్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.

అసెంబ్లీ కోటాలో మిగిలిన రెండు స్థానాలు, గవర్నర్ కోటాలోని మూడు స్థానాల్లో రెండు బీసీ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెరొకటి, ఒకటి బ్రాహ్మణ వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు తుది జాబితాపై స్పష్టత లేదు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు