ఘట్‌కేసర్ బస్టాండ్‌లో నీటి కొరతతో మరుగుదొడ్ల మూసివేత, ప్రయాణికుల ఇబ్బందులు

ఘట్‌కేసర్ బస్టాండ్ మరుగుదొడ్లు: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో నీటి కొరత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ బస్టాండ్‌లోని సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్లను మంగళవారం మూసేశారు. నీళ్లు లేవని చెబుతూ అక్కడ 'నీళ్లు లేవు.. రేపు రండి' అనే బోర్డు దర్శనమివ్వడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. నిత్యం వందల మంది రాకపోకలు సాగించే పట్టణ కేంద్ర బస్టాండ్‌లో మరుగుదొడ్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నవంబర్ నెలలోనే పరిస్థితి.

ఘట్‌కేసర్ బస్టాండ్ మరుగుదొడ్లు, NewzFast Telugu (ఘట్‌కేసర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో నీటి కొరత తీవ్రమవుతోంది.

ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ బస్టాండ్‌లోని సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్లను మంగళవారం మూసేశారు. నీళ్లు లేవని చెబుతూ అక్కడ ‘నీళ్లు లేవు..

రేపు రండి’ అనే బోర్డు దర్శనమివ్వడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

నిత్యం వందల మంది రాకపోకలు సాగించే పట్టణ కేంద్ర బస్టాండ్‌లో మరుగుదొడ్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నవంబర్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఎండాకాలం ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌లో నీటి సౌకర్యానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు