రామప్ప సమీపంలో పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కాస్ట్ గని భవితవ్యంపై ప్రశ్నలు

పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కాస్ట్ గని: ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో ప్రతిపాదించిన పీవీ నరసింహరావు (పీవీఎన్‌ఆర్‌) ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఈ ప్రాజెక్టును సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుమారు 40.43 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థ 2021లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఈ గనికి సమీపంలోనే ఉంది. ఓపెన్‌కాస్ట్.

పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కాస్ట్ గని, NewzFast Telugu (ములుగు జిల్లా, తెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో ప్రతిపాదించిన పీవీ నరసింహరావు (పీవీఎన్‌ఆర్‌) ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఈ ప్రాజెక్టును సుమోటోగా విచారణకు స్వీకరించింది.

సుమారు 40.43 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థ 2021లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఈ గనికి సమీపంలోనే ఉంది.

ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ పేలుళ్లు, భూప్రకంపనల వల్ల ఆలయ పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గని వల్ల రామప్ప సరస్సు పరీవాహక ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు దెబ్బతింటాయని, సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గని విస్తరణ కోసం వేలాది ఎకరాల వ్యవసాయ భూములను సేకరించాల్సి వస్తుందని, దాంతో స్థానికులు జీవనోపాధి కోల్పోతారన్న భయాలు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని అక్కడివారు డిమాండ్‌ చేస్తున్నారు.

తవ్వకాల వల్ల కలిగే పర్యావరణ, భౌగోళిక ప్రభావాలపై స్వతంత్ర సంస్థలతో సమగ్ర అధ్యయనాలు నిర్వహించి, ఆ నివేదికలను బహిరంగపరచాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, గని వల్ల రామప్ప ఆలయానికి ఎలాంటి ప్రమాదం ఉండదని సింగరేణి అధికారులు చెబుతున్నారు.

భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, రామప్ప దేవాలయ భద్రతపై ఐఐటీ మద్రాస్‌ వంటి ప్రముఖ సంస్థలతో అధ్యయనాలు చేయించి, ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఆ అధ్యయనాల ప్రకారం రామప్పకు ఎలాంటి ప్రమాదం లేదని, భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) నిబంధనలకు అనుగుణంగానే అధ్యయనాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఫైల్‌ ములుగు కలెక్టర్‌ వద్ద ఉందని, ఎన్‌వోసీ వచ్చిన వెంటనే అధ్యయన నివేదికలను భారత పురావస్తు శాఖకు పంపిస్తామని ఆయన చెప్పారు. ఎన్‌జీటీ సుమోటో కేసుకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు