తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ చలి తీవ్రత: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. రోజురోజుకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. వచ్చే మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 12.5 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చలి తీవ్రతకు సంబంధించి అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అత్యల్పంగా 12.4 డిగ్రీలు నమోదైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుబేర్ మండల కేంద్రంలో 14.6 డిగ్రీలు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు.

తెలంగాణ చలి తీవ్రత, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. రోజురోజుకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి.

వచ్చే మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 12.5 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చలి తీవ్రతకు సంబంధించి అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అత్యల్పంగా 12.4 డిగ్రీలు నమోదైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుబేర్ మండల కేంద్రంలో 14.6 డిగ్రీలు నమోదయ్యాయి.

వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బషీరాబాద్, యాలాల్, మోమిన్‌పేటల్లో 14.7 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో 14.8 డిగ్రీలు, మేడ్చల్-మల్కాజిగిరిలోని శామీర్‌పేటలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని దుండిగల్‌లో 15.9, బేగంపేటలో 16.2, హకీంపేట, హయత్‌నగర్‌లలో 18.2 డిగ్రీలుగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే చలి తీవ్రత పెరగలేదని తెలుస్తోంది. గత ఏడాది ఇదే రోజు రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 10.4 డిగ్రీలుగా రికార్డయింది.

సోమవారం రాత్రి 25 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులను రాత్రి వేళ వీస్తున్న చలి గాలులు వణికిస్తున్నాయి. దీంతో వాకింగ్, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండగా, రోడ్లను మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6-8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండగా, గరిష్టంగా 30-32 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు