720 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్‌ విడుదల

గ్రూప్-2 ఉద్యోగాలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఈ నెల మొదటి వారంలోనే 2,721 పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఇప్పుడు కీలకమైన 720 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ మంగళవారం సమగ్ర నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంతకుముందు ఇచ్చిన షార్ట్‌ నోటిఫికేషన్‌ కంటే తాజాగా పోస్టుల సంఖ్య పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్‌, 249 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ 6, డిప్యూటీ మండల పరిషత్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌.

గ్రూప్-2 ఉద్యోగాలు, NewzFast Telugu (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఈ నెల మొదటి వారంలోనే 2,721 పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఇప్పుడు కీలకమైన 720 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ మంగళవారం సమగ్ర నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఇంతకుముందు ఇచ్చిన షార్ట్‌ నోటిఫికేషన్‌ కంటే తాజాగా పోస్టుల సంఖ్య పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్‌, 249 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి.

ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ 6, డిప్యూటీ మండల పరిషత్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ 176, సహకార శాఖలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 10, డిప్యూటీ తహసీల్దార్‌ 203 ఖాళీలు ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ల శాఖలో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌ 7, జీఎస్టీ ఆఫీసర్‌ 40, ఎక్సైజ్‌ ఎస్‌ఐ 29 పోస్టులు కేటాయించారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో జీఏడీ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 71, ఆర్థిక శాఖ ఏఎ్‌సవో 5, న్యాయశాఖ ఏఎ్‌సవో 4, ట్రెజరీ(హెచ్‌వోడీ)లో సీనియర్‌ అకౌంటెంట్‌ 90 పోస్టులు ఉన్నాయి.

ట్రెజరీ(జిల్లా)లో సీనియర్‌ అకౌంటెంట్‌ 1, ట్రెజరీ జూనియర్‌ అకౌంటెంట్‌ 47 పోస్టులు ఉన్నాయి. అలాగే పరిశ్రమల, వైద్య ఆరోగ్య, పశుసంవర్థక, జైళ్ల, వ్యవసాయ శాఖలతో పాటు పలు కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు డిసెంబరు 11 అని కమిషన్‌ పేర్కొంది.

అభ్యర్థులు ముందుగా ఓటీపీఆర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఫిబ్రవరి 21న స్ర్కీనింగ్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

అనంతరం మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు