ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్ అనుసంధానం, రైతులకు 9 గంటల నిరంతర ఉచిత కరెంటు

ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు సౌర విద్యుత్‌ను అనుసంధానం చేసి వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక, జల వనరుల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ఇరిగేషన్‌ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్‌ను అనుసంధానించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ చేసిన ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనపై మంగళవారం సమీక్షలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ.

ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్, NewzFast Telugu (అమరావతి): రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు సౌర విద్యుత్‌ను అనుసంధానం చేసి వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక, జల వనరుల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా, రాష్ట్ర ఇరిగేషన్‌ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్‌ను అనుసంధానించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ చేసిన ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనపై మంగళవారం సమీక్షలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండటంతో పాటు జాతీయ మీడియాకు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి రావడంతో సమీక్షను బుధవారానికి వాయిదా వేశారు.

రాష్ట్రంలో ఏపీఎస్ఐడీసీ అధీనంలోని 1023 ఎత్తిపోతల పథకాల్లో 166 సంపూర్ణంగా పనిచేస్తున్నాయి, 503 పాక్షికంగా పనిచేస్తున్నాయి. మరో 120 పూర్తిగా పనిచేయడం లేదు.

వీటికి మరమ్మతులు చేసి పంపులు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, ప్రెజర్‌ పైపులు, ఇతర సివిల్‌ నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు. వీటి పునరుద్ధరణకు రూ.632 కోట్ల వ్యయం అవుతుందని, పదేళ్లపాటు నిర్వహణకు రూ.2,314 కోట్లు, మొత్తంగా రూ.2,946 కోట్లు ఖర్చవుతుందని ఆర్థిక శాఖ తెలిపింది.

ఈ ప్రతిపాదనలో 903.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లు, 240 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బెస్) ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో ఏటా 1551 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, అందులో 517 ఎంయూలను ఎత్తిపోతలకు వినియోగించి, మిగిలిన 1034 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు విక్రయించాలని ప్రతిపాదించారు.

ఈ పథకానికి రూ.5072 కోట్ల మూలధన వ్యయం అవసరమని అంచనా. ఇందులో కేంద్ర వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.1314 కోట్ల గ్రాంటు, ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడి కింద రూ.832 కోట్లు, 9 శాతం రాయితీతో కూడిన రుణం రూ.1942 కోట్లు, రాష్ట్ర వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.984 కోట్లు వినియోగించవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.

సాగునీటి సెస్‌ వసూళ్ల ద్వారా రూ.1560 కోట్లు, పారిశ్రామిక నీటి కేటాయింపుల ద్వారా రూ.950 కోట్లు రాబడి వస్తుందని అంచనా. ఎత్తిపోతలకు వినియోగించే విద్యుత్ పోను గ్రిడ్‌కు విక్రయించే కరెంటు ద్వారా రూ.1364 కోట్ల ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొన్నారు.

ఈ విధానం వల్ల మొదటి పదేళ్లలో స్థూల ఆదాయం రూ.14,926 కోట్లు వస్తుందని అంచనా వేశారు.

ఎత్తిపోతల పథకాలకు సోలార్ ప్లాంట్ల స్థాపన కోసం జల వనరుల శాఖ ల్యాండ్‌బ్యాంక్, ఏపీఎస్ఐడీసీ ప్రాంగణాల్లో 4,170 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలా సౌర విద్యుత్‌ను అనుసంధానిస్తే అన్నదాతలకు ఉచితంగా, 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు