సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 17న ఉద్యోగుల సామూహిక సెలవు

సీపీఎస్ రద్దు: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్‌తో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఈ నెల 17న ఉద్యోగులు మూకుమ్మడిగా సామూహిక సెలవులు పెట్టాలని పిలుపునిచ్చింది. అదేరోజు హైదరాబాద్‌లో ధర్మదీక్ష సభ నిర్వహిస్తామని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) నేతలు ప్రకటించారు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉండగా, అత్యవసర సేవలైన.

సీపీఎస్ రద్దు, NewzFast Telugu (తెలంగాణ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్‌తో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఈ నెల 17న ఉద్యోగులు మూకుమ్మడిగా సామూహిక సెలవులు పెట్టాలని పిలుపునిచ్చింది.

అదేరోజు హైదరాబాద్‌లో ధర్మదీక్ష సభ నిర్వహిస్తామని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) నేతలు ప్రకటించారు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉండగా, అత్యవసర సేవలైన హెల్త్, పోలీసు ఉద్యోగులను మినహాయిస్తే 2.2 లక్షల మంది సామూహిక సెలవులు పెడతారని నేతలు చెప్పారు.

2023 నవంబర్ 17న విడుదలైన కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఆ తేదీకి ఈ నెల 17తో మూడేళ్లు పూర్తవుతున్నాయి.

ఇంతవరకు ఈ హామీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 17లోపు సీపీఎస్ రద్దు చేయాలని ఆగస్టు 23న ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినట్లు సీపీఎస్‌ఈయూ తెలిపింది.

సీపీఎస్ రద్దు కోసం అధ్యయన కమిటీ వేస్తామని, మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుంటామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని, అయితే ఇంతవరకు కమిటీని నియమించలేదని, జీవో కూడా విడుదల కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కర్ణాటక, కేరళ, తెలంగాణలో కాంగ్రెస్ సీపీఎస్ రద్దు డిమాండ్‌తోనే అధికారంలోకి వచ్చిందని, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.

పాత పింఛన్ విధానం రద్దుతో 22 ఏళ్లుగా ఉద్యోగులు సామాజిక భద్రత లేక ఇబ్బంది పడుతున్నారని సంఘాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 5 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వారిలో ఎవరికీ రూ.5 వేలకు మించి పెన్షన్ అందడం లేదని, కొందరికి రూ.1,600 కూడా దాటడం లేదని తెలిపారు.

సీపీఎస్ ఉద్యోగుల వాటా సొమ్ము షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టగా, ఈ ఏడాది మార్చిలో రూ.1,800 కోట్లు ఆవిరయ్యాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం వాటాను ప్రాన్ ఖాతాల్లో జమ చేయడం లేదని, ఉద్యోగుల వేతనం నుంచి కోసిన 10 శాతం వాటాను ప్రభుత్వం వినియోగించుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలు కావడం లేదని కూడా సంఘాలు చెబుతున్నాయి.

తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ మాట్లాడుతూ, ‘మా పాత పింఛన్ మాకివ్వాలే’ నినాదంతో ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. ఆగస్టు 23న సామూహిక సెలవుల నోటీసును ప్రకటించి, చీఫ్ సెక్రటరీకి కూడా అందజేసినట్లు తెలిపారు.

స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు