రిటైర్డ్‌ అధికారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి: పదవీ విరమణ చేసి తిరిగి ఉద్యోగంలో చేరిన అధికారులకు కూడా ఎంసీసీ ఆంక్షలు వర్తిస్తాయని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అధికార దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో సమావేశాలు నిర్వహించరాదని, రాజకీయ తటస్థత పాటించాలని ఆదేశించింది. ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి, NewzFast Telugu (న్యూఢిల్లీ): అధికార దుర్వినియోగానికి కొందరు అధికారులు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కింద ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆంక్షలు, నిషేధాలను పదవీ విరమణ చేసి తిరిగి ఉద్యోగంలో చేరిన అధికారులకు, వ్యక్తులకు కూడా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తరించింది.

వివిధ హోదాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఎంసీసీ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు గతంలో వచ్చాయని ఒక సీనియర్‌ ఉన్నతాధికారి తెలిపారు.

అటువంటి వ్యక్తులు రాజకీయ తటస్థతను పాటించాలని, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా లేదా ఓట్ల కోసం ప్రచారం చేయకుండా ఉండాలని ఈనెల 9న గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఈసీఐ పేర్కొంది.

ఎన్నికలు ప్రకటించిన నియోజకవర్గం లేదా జిల్లాకు చెందిన ఎన్నికల అధికారులను అధికారిక చర్చలు లేదా సమావేశాల కోసం పదవీ విరమణ చేసి తిరిగి విధుల్లో చేరిన అధికారులు పిలవకూడదని ఈసీఐ ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు లేదా సమావేశాలు నిర్వహించరాదని కూడా తెలిపింది.

ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని ఈసీఐ హెచ్చరించింది. వీటిని కచ్చితంగా పాటించేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు