డార్క్ చాక్లెట్, NewzFast Telugu (హైదరాబాద్): విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’ ఈ నెల 13న విడుదల కానున్నది. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ కలిసి సమర్పిస్తున్నాయి.
ఈ సందర్భంగా సినిమా కర్టెన్‌రైజర్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ, ఇది ప్యాషన్‌తో తీసిన సినిమా అని చెప్పారు.
సినిమా అనే ఫార్మాట్‌కే ఛాలెంజ్ చేసేంత కొత్తగా దర్శకుడు శశాంక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రేక్షకులకు ఇది గుర్తుండిపోతుందని తెలిపారు.
కథానాయిక బిందు మాధవి ఈ సినిమాలో భాగం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చూసిన వారంతా ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలంటున్నారని ఆమె పేర్కొన్నారు.
విశ్వదేవ్ నటనతో సినిమా మరో స్థాయికి చేరిందని ఆమె ప్రశంసించారు.
దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవయ మాట్లాడుతూ, ఈ సినిమా మూడు రోజులకు ముందే యూఎస్‌లో విడుదల కానుందని తెలిపారు. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు రవికాంత్, ఆదిత్య, మల్లిక్‌రామ్ కూడా మాట్లాడారు.




