ఇంకా ఏం అనుకోలేదు, NewzFast Telugu (హైదరాబాద్): వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, ఈటీవీ విన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’ లోని ‘మేఘాలు సంద్రంలో’ అనే గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో విడుదల చేశారు.
అక్షయ్ లగుసాని, కేయూరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని కలిసి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 11న సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘అందరికీ రిలేట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది.
వీరిద్దరూ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే దర్శకులవుతారు’ అని అన్నారు.
సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుందని దర్శకులు ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని చెప్పారు. సినిమాలో భాగం కావడం పట్ల కథానాయకుడు అక్షయ్ లగుసాని, కథానాయిక కేయూరి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈటీవీ ప్రతినిధులు భరణ్, సాయికృష్ణతోపాటు చిత్రబృందమంతా పాల్గొని మాట్లాడారు.




