రైతులపై బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి

బీజేపీ ఎంపీ రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు: బీజేపీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రైతులు కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేస్తారని, మిగిలిన తొమ్మిది నెలలు పేకాడుతూ, గుట్కాలు తింటూ, మద్యం తాగుతూ గడిపేస్తారని ఆయన ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని మోగంజ్‌ జిల్లా రేవా నియోజకవర్గ పరిధిలో జరిగిన గోవర్ధన పూజ సందర్భంగా ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలో ఇప్పటి రైతులు గతంలో మాదిరిగా లేరని, సౌకర్యవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డారని పేర్కొన్నారు. రైతులను.

బీజేపీ ఎంపీ రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు, NewzFast Telugu (రేవా, మధ్యప్రదేశ్): బీజేపీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రైతులు కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేస్తారని, మిగిలిన తొమ్మిది నెలలు పేకాడుతూ, గుట్కాలు తింటూ, మద్యం తాగుతూ గడిపేస్తారని ఆయన ఆరోపించారు.

సోమవారం మధ్యప్రదేశ్‌లోని మోగంజ్‌ జిల్లా రేవా నియోజకవర్గ పరిధిలో జరిగిన గోవర్ధన పూజ సందర్భంగా ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలో ఇప్పటి రైతులు గతంలో మాదిరిగా లేరని, సౌకర్యవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డారని పేర్కొన్నారు.

రైతులను అవమానించారని ఆగ్రహిస్తూ కాంగ్రెస్‌ నాయకులు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రైతులకు మిశ్రా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి కమల్‌ చౌదరి ఎక్స్‌ వేదికగా స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీకి ఇటువంటి ప్రకటనలు చేసే ఎంపీ ఉన్నారని ఆమె విమర్శించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు