ప్రియా భవానీ శంకర్, NewzFast Telugu: న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టి విజయాలు అందుకున్న కథానాయిక ప్రియా భవానీ శంకర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజా సమాచారం వెలువడింది. తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ భామ ‘ఇరుముడి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది.
ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రియుడు రాజవేల్ రాజన్తో కలిసి తీయించుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తులు ధరించిన ఈ జంట మెడలో మల్లెపూల దండలు, నుదుటిపై చందనం బొట్లు ధరించి కనిపిస్తున్నారు.
ఈ ఫొటోలు చూసిన అభిమానులు ప్రీ వెడ్డింగ్ వేడుక ఏమైనా జరిగిందా, త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తమ వివాహంపై ప్రియా భవానీ శంకర్, రాజవేల్ రాజన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సమాచారం ప్రకారం, ఈ జంట కాలేజీ రోజుల నుంచే ప్రేమలో ఉన్నారు. గత కొంతకాలంగా వారు సహజీవనం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రియా భవానీ శంకర్ ‘డిమోంటే కాలనీ-3’ చిత్రంలో నటిస్తున్నారు.




