జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్, NewzFast Telugu (టోక్యో): జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి త్రీసా జోలీ, గాయత్రి గోపీచంద్ ప్రవేశించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోటీలో గాయత్రి-త్రీసా జోడీ 21-17, 21-14 తేడాతో వరుస సెట్లలో జపాన్‌కు చెందిన హినాతా-నియో యమరికితా జోడీని ఓడించింది.
ఈ గేమ్‌ను భారత షట్లర్లు కేవలం 42 నిమిషాల్లోనే ముగించారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్-ఎంఆర్ అర్జున్ జోడీ 11-6 ఆధిక్యంలో ఉన్న దశలో, మలేషియాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్స్ ఆరోన్ ఛియా-సోహ్ వుయ్ టోర్నీ నుంచి వైదొలిగారు.
తొలిరోజు భారత మిక్స్డ్ జోడీ ధ్రువ్ కపిల-రాధికా శర్మ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో 11-9 ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత 21-16తో గేమ్‌ను కోల్పోయారు.
రెండో గేమ్‌లో ఒక దశలో 14-14తో స్కోరు సమం చేసినా 21-15తో ఓడిపోయారు.




