శ్రీజ కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ, అధికారులతో మాట్లాడతానని హామీ

శ్రీజ అదృశ్యం: నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన శ్రీజ తండ్రి యాదగిరిరెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ఫోన్‌లో పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. శ్రీజ అదృశ్యంపై అక్కడి అధికారులతో మాట్లాడతానని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి అండగా నిలవాలని కోరడంతో ఆయన వెంటనే స్పందించారు. కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని కేటీఆర్‌ అభయమిచ్చారు. శ్రీజ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు.

శ్రీజ అదృశ్యం, NewzFast Telugu (నల్లగొండ): నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన శ్రీజ తండ్రి యాదగిరిరెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ఫోన్‌లో పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

శ్రీజ అదృశ్యంపై అక్కడి అధికారులతో మాట్లాడతానని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి అండగా నిలవాలని కోరడంతో ఆయన వెంటనే స్పందించారు.

కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని కేటీఆర్‌ అభయమిచ్చారు. శ్రీజ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆచూకీ కనుక్కోలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

శ్రీజ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీంపాషా, కాంచనపల్లి రవీందర్‌రావు, అయితగోని యాదయ్యగౌడ్‌, కడారి కృష్ణయ్య, కోట్ల జైపాల్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు