శ్రీల ప్రభుపాదుల జీవితం ఆధారంగా ‘శరణాగతి’ చిత్రం ప్రకటన

శరణాగతి సినిమా: ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైన పరమ పావన శ్రీల ప్రభుపాదుల జీవితం ఆధారంగా ‘శరణాగతి’ చిత్రం తెరకెక్కుతోంది. ‘ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గౌరశక్తిదాస ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేశ్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు మేకర్స్.

శరణాగతి సినిమా, NewzFast Telugu: ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైన పరమ పావన శ్రీల ప్రభుపాదుల జీవితం ఆధారంగా ‘శరణాగతి’ చిత్రం తెరకెక్కుతోంది. ‘ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.

హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గౌరశక్తిదాస ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రాజేశ్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

ఈ సినిమా కోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఏఐ, కంప్యూటర్ విజన్ టెక్నాలజీలను కలిపి మనుషుల కదలికలను డిజిటల్ యానిమేషన్‌గా మార్చనున్నారని, ఇది యానిమేషన్ పాత్రలకు మరింత సహజత్వం తీసుకొస్తుందని వారు వివరించారు.

భగవద్గీతలోని శాశ్వత బోధనలు, శ్రీకృష్ణ సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో 1965లో తన 69వ ఏట శ్రీల ప్రభుపాదులు భారతదేశం నుంచి అమెరికాకు ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి కృష్ణచైతన్య సందేశాన్ని చేరవేసే మహోద్యమంగా మారింది.

ఈ ప్రయాణమే ఈ సినిమాకు ప్రధానాంశమని మేకర్స్ తెలిపారు.

ఈ అచంచల విశ్వాసం, శరణాగతి, పట్టుదల, నిస్వార్థ సేవకు శ్రీల ప్రభుపాదుల జీవితం గొప్ప నిదర్శనమని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు