ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ (ఐటీజీఎస్ 2026) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల డెలిగేట్లు, పెట్టుబడిదారులు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ (ఐటీజీఎస్ 2026) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

ఆసక్తి గల డెలిగేట్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు invite-itgs2026.telangana.gov.in అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బుధవారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సమ్మిట్‌లో భాగంగా రక్షణ, ఏరోస్పేస్, ఏఐ రంగాలతో కూడిన రక్షా ఎక్స్‌పో విన్యాసాల ఎయిర్ షో, 136 అంకుర సంస్థలతో స్టార్టప్ పెవిలియన్, యానిమేషన్-గేమింగ్ రంగాలకు సంబంధించి ఇండియాజాయ్ 2026, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, తెలంగాణ పెవిలియన్ సహా మొత్తం తొమ్మిది ప్రధాన ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి.

దీంతోపాటు వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు ‘తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్’ (టీఐఎస్‌సీ) దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు