కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలూ ఏకగ్రీవమేనా?

సర్పంచ్ ఎన్నికలు: ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో, సర్పంచ్ పదవులు కూడా అదే బాటలో ఉంటాయనే ఊహాగానాలు నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నెలలో నోటిఫికేషన్ రానుండటంతో నాయకుల మధ్య మంతనాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయ సమాచారం. జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ లేని విధంగా 85 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలను ఇరు పార్టీల నాయకులు సయోధ్య ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం.

సర్పంచ్ ఎన్నికలు, NewzFast Telugu (కర్నూలు జిల్లా, కొలిమిగుండ్ల): ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో, సర్పంచ్ పదవులు కూడా అదే బాటలో ఉంటాయనే ఊహాగానాలు నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నెలలో నోటిఫికేషన్ రానుండటంతో నాయకుల మధ్య మంతనాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయ సమాచారం.

జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ లేని విధంగా 85 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలను ఇరు పార్టీల నాయకులు సయోధ్య ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం ఒక్క స్థానానికీ ఎన్నికలు జరగలేదు.

ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండటంతో, పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా పార్టీల ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

నియోజకవర్గంలో మొత్తం 102 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు, పలుకూరు మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి.

సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 19న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. డిసెంబరు 2న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

నియోజకవర్గంలో బనగానపల్లె మండలంలో 24, కొలిమిగుండ్ల 23, అవుకు 21, కోవెలకుంట్ల 17, సంజామల 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించనున్నారు.

సర్పంచ్ పదవుల్లో 70/30 ఫార్ములాను అమలు చేసేందుకు ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 70 శాతం టీడీపీకి, 30 శాతం వైసీపీకి కేటాయించేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఎక్కడైనా కార్యకర్తల మధ్య రాజీ కుదరకపోతే, పదవీ కాలాన్ని సగం సగం పంచుకునే ఆలోచన కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునే అవకాశం లేకపోవడంతో ఓటర్లు ఇప్పటికే నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా ఏకగ్రీవమయ్యే సమాచారంతో గ్రామాల్లో “సర్పంచ్ ఎన్నికలు కూడా లేనట్లేనా” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు