‘ఇంకా ఏం అనుకోలేదు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మేఘాలు సంద్రంలో’ విడుదల

ఇంకా ఏం అనుకోలేదు: వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’ నుంచి తొలి పాట ‘మేఘాలు సంద్రంలో’ విడుదలైంది. గతంలో ఈటీవీ విన్‌తో కలిసి పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి ఈ సంస్థతో చేతులు కలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, ఫ్రెండ్‌షిప్ డే వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకున్నాయి. సాధారణ ప్రచార పద్ధతులకు భిన్నంగా వ్యంగ్యం, హాస్యం, మీమ్స్‌తో కూడిన వినూత్న.

ఇంకా ఏం అనుకోలేదు, NewzFast Telugu: వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’ నుంచి తొలి పాట ‘మేఘాలు సంద్రంలో’ విడుదలైంది. గతంలో ఈటీవీ విన్‌తో కలిసి పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి ఈ సంస్థతో చేతులు కలిపారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, ఫ్రెండ్‌షిప్ డే వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకున్నాయి. సాధారణ ప్రచార పద్ధతులకు భిన్నంగా వ్యంగ్యం, హాస్యం, మీమ్స్‌తో కూడిన వినూత్న వీడియోలను చిత్రబృందం విడుదల చేసింది.

తాజాగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో ‘మేఘాలు సంద్రంలో’ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి స్వరపరిచిన ఈ మెలోడీ ఆకట్టుకునేలా ఉంది.

కథానాయకుడు అక్షయ్ లగుసాని పోషిస్తున్న అభి పాత్ర ప్రేమ భావాలను నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా గీత రచయిత కిట్టు విస్సాప్రగడ తన సాహిత్యంలో వ్యక్తీకరించారు.

ఆదిత్య ఆర్కే, గోమతి అయ్యర్ ఆలపించిన ఈ పాటకు వారి గాత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్షయ్, కేయూరి మధ్య కెమిస్ట్రీ, అందమైన కాలేజీ నేపథ్యం, ఆకర్షణీయమైన విజువల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

పాట చివర్లో జైకృష్ణ తనదైన వినోదంతో అలరించారు.

ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, రెహాన్ షేక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ కన్ను, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

స్నేహం, వినోదం ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ చిత్రం 2026 డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్‌, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు