నకిలీ ఒప్పంద పత్రాలు, NewzFast Telugu (పోచారం, ఘట్కేసర్): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన నకిలీ ఒప్పంద పత్రాల బాగోతం బయటపడింది. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది, ఈ వ్యవహారంలో ఒక మహిళపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే, పోచారం డివిజన్ కొర్రెములలోని 880 చదరపు గజాల స్థలానికి సంబంధించి యజమాని ఆకిటి మంజులతో 2026 జూలై 28న వోకాసా కిచెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ హరిత గోగినేని లీజు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒప్పంద పత్రంలో కంపెనీ కార్యాలయ చిరునామాను చేతిరాతతో నింపడంతో మంజులకు అనుమానం కలిగింది.
అనుమానంతో ఆమె సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి వాణిజ్య పన్నుల శాఖ నుంచి సమాచార పత్రాలు సేకరించారు. ఆ పత్రాల ఆధారంగా, జూన్ 2న నెలకు రూ.8 వేల అద్దె, రూ.12 సెక్యూరిటీ డిపాజిట్‌తో 11 నెలల కాలానికి అద్దె ఒప్పందం కుదిరినట్లు చూపుతూ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు.
జూన్ 1 నుంచి అద్దెకు తీసుకున్నట్లు చూపుతూ ఆ పత్రాన్ని ఉపయోగించి జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్లు పొందినట్లు తేలింది. సోమవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




