రావణాసురుడిగా యష్, NewzFast Telugu: నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటుడు యష్ నటించగా, ఆ పాత్ర కూడా ప్రత్యేకంగా నిలిచింది.
తాజాగా యష్ లుక్స్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రావణుడి పాత్రలో కనిపించేందుకు యష్ ప్రతిరోజు సుమారు 33 కిలోల బరువైన కాస్ట్యూమ్స్ ధరించేవారని ఆయన తెలిపారు.
అలాగే ఆయన ధరించిన కిరీటం ఏకంగా 1.8 కిలోల బరువు ఉండేదని చెప్పారు.
రావణుడి పాత్ర కోసం యష్ ధరించిన నగలను ఆమ్రపాలి సంస్థ డిజైన్ చేసింది. ఆ సంస్థ సీఈఓ మాట్లాడుతూ, రావణుడు లంకాధిపతి కావడంతో ఆయనను అత్యంత సంపన్న రాజుగా చూపించేందుకు నగలను ప్రత్యేకంగా తయారు చేశామని, అలాగే రావణుడిలోని విభిన్న కోణాలు ప్రతిబింబించేలా డిజైన్ చేశామని వివరించారు.
ఈ సినిమాలోని రావణుడి సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారు రేకులను ఉపయోగించినట్లు ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు. ఈ సింహాసనం కోసం కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళి కానుకగా విడుదల కానుంది. రెండు భాగాల కోసం సుమారు నాలుగు వేల కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది.




