బల్గేరియా హైవే ప్రమాదం, NewzFast Telugu (బల్గేరియా): దట్టమైన పొగమంచు కారణంగా 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆగ్నేయ బల్గేరియాలోని ప్రధాన మోటార్వే అయిన ట్రాకియా హైవేపై మంగళవారం ఉదయం జరిగింది.
కనుచూపు మేర దారి కనిపించనంతగా పొగమంచు కమ్మేయడంతో వాహనాలు వేగంగా ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 27 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రహదారికి ఇరువైపులా కార్లు, భారీ ట్రక్కులు నుజ్జునుజ్జయి ఒకదానిపై ఒకటి పడిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విధ్వంసకరంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నుజ్జయిన వాహనాల్లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. తీవ్ర పొగమంచు, తడిసిన రోడ్డు, మితిమీరిన వేగమే ఈ పెను ప్రమాదానికి ప్రాథమిక కారణాలని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదం కారణంగా హైవేపై రెండు వైపులా ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.




