రంగారెడ్డి జిల్లాలో రూ.5 లక్షలతో 20 రోజుల్లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

ఇందిరమ్మ ఇల్లు: తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందించేందుకు ఒక మోడల్ ఇంటిని అందుబాటులోకి తెచ్చారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రూ.5 లక్షల బడ్జెట్‌లో కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే నిర్మించిన ఈ ఆధునిక మోడల్ ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఘనంగా ప్రారంభించారు. కాల్జన్ సంస్థ.

ఇందిరమ్మ ఇల్లు, NewzFast Telugu (రంగారెడ్డి జిల్లా, షాబాద్): తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందించేందుకు ఒక మోడల్ ఇంటిని అందుబాటులోకి తెచ్చారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రూ.5 లక్షల బడ్జెట్‌లో కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే నిర్మించిన ఈ ఆధునిక మోడల్ ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఘనంగా ప్రారంభించారు.

కాల్జన్ సంస్థ ఆధ్వర్యంలో ‘స్టీల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఫామ్‌వర్క్’ సాంకేతికత, మోనోలిథిక్ కాంక్రీట్ విధానాన్ని ఉపయోగించి ఈ మోడల్ నిర్మాణాన్ని బలంగా చేపట్టారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయ పరిమితిలోనే పూర్తి నాణ్యతతో స్వల్ప వ్యవధిలో పనులు పూర్తి చేసి ఇల్లు అప్పగిస్తామని, ఈ తరహా నిర్మాణాలకు 15 నుంచి 20 ఏళ్ల పాటు గ్యారెంటీ ఇస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

లబ్ధిదారులు ఈ మోడల్ ఇంటిని నేరుగా సందర్శించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని, ఈ ఆధునిక సాంకేతిక విధానాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య పిలుపునిచ్చారు. తక్కువ సమయంలో, అనుకూలమైన బడ్జెట్‌లో నిర్మాణాలు పూర్తి చేసుకోవడం వల్ల పేదలకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు