వారణాసి తెలుగు హక్కులు, NewzFast Telugu: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రిస్టీజియస్ ప్రాజెక్టు వారణాసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది.
ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా వేగంగా సాగుతున్నాయి.
ఈ ఏడాది ముగిసేలోగా అన్ని ఏరియాల హక్కుల అమ్మకాలు పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
తాజాగా వినిపిస్తున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారణాసి తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోని తెలుగు వెర్షన్ హక్కులు కలిపి రూ.290 కోట్లకు డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త నిజమైతే తెలుగు సినిమా బిజినెస్ చరిత్రలో ఇది సంచలన డీల్‌గా నిలిచే అవకాశం ఉంది.
మిగిలిన ఏరియాల హక్కుల విక్రయాలపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. డిజిటల్ హక్కుల విషయంలోనూ రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతూనే, విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అంతర్జాతీయ స్టూడియోలతో సంప్రదింపులు సాగిస్తున్నారట.
ఇంగ్లీష్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.




