టాక్సిక్ ఓటీటీ, NewzFast Telugu: సాధారణంగా ఏ పాన్-ఇండియా సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 8 వారాల్లోపే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించినా గరిష్టంగా రెండు నెలల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంది.
కానీ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ థియేటర్లలోకి వచ్చి 10 వారాలు దాటినా, ఈ రోజుకి సరిగ్గా 76 రోజులు పూర్తయినా ఇప్పటివరకు ఏ ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. దీని వెనుక కారణాలను పరిశీలిస్తే, మేకర్స్‌కు, స్ట్రీమింగ్ సంస్థలకు మధ్య జరుగుతున్న ధరల వివాదం బయటపడింది.
సినిమా విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం సుమారు రూ. 150 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాయని సమాచారం. అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాకు భారీ హైప్ వచ్చి రూ. 200 కోట్లకు పైగా డిమాండ్ చేయవచ్చనే అంచనాతో నిర్మాతలు ఆ డీల్‌ను హోల్డ్‌లో పెట్టారని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ఓటీటీ దిగ్గజాలు వెనక్కి తగ్గాయి.
ప్రముఖ సంస్థ జీ5 అన్ని భాషల డిజిటల్ రైట్స్ కోసం కేవలం రూ. 30 కోట్ల వరకు మాత్రమే ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అందులోనూ సగం మొత్తాన్ని ముందే చెల్లించి, మిగిలిన సగాన్ని పే-పర్-వ్యూ పద్ధతిలో ఇస్తామని షరతు పెట్టినట్లు సమాచారం.
గతంలో వచ్చిన రూ. 150 కోట్ల ఆఫర్‌తో పోలిస్తే ఇది కనీసం పావు వంతు కూడా లేకపోవడంతో నిర్మాతలు ఆ డీల్‌కు అంగీకరించలేకపోతున్నారని తెలుస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విడుదలై నేటికి 76 రోజులు పూర్తయ్యాయి.
అయినప్పటికీ ధరల పంచాయితీ కొలిక్కి రాకపోవడంతో డిజిటల్ రిలీజ్ హోల్డ్‌లోనే ఉంది.
ఓటీటీ సంస్థల నుంచి మంచి ధర రాబట్టేందుకు, ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించేందుకు సినిమాను కొత్తగా రీ-ఎడిట్ చేసి ఫ్రెష్ కట్‌తో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఎడిట్‌తోనైనా ఓటీటీ డీల్ కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.




