రుద్రంగి రైతు వేదిక అవగాహన, NewzFast Telugu (రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రైతు వేదికలో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, పంటల సంరక్షణ మరియు యాసంగి పంట మార్పిడిపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరమున్న పంటల సాగుపై పునరాలోచించాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా పసుపు, వెల్లుల్లి, మిరప, ధనియాలు వంటి పంటల సాగు యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక మరియు నీటి సమర్థవంతమైన వినియోగంపై రైతులకు సమగ్రంగా వివరించారు.
ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో నటరాజ్, ఎం.ఏ.ఓ సాయి కిరణ్, ఎం.ఆర్.ఓ పుష్పలత, ఏ.ఈ.ఓ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. అలాగే ఏఎంసీ చైర్మన్ తిరుపతి, గ్రామ సర్పంచ్ గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన అనంతరం, క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ప్రగతిశీల రైతు సుమంతు రాజిరెడ్డి పొలాన్ని ఎం.ఏ.ఓ ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ పర్యటనలో ఏ.ఈ.ఓ కూడా పాల్గొని పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, రైతుకు తగిన సలహాలు, సూచనలు అందించారు.




