చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు మంత్రుల ఘన స్వాగతం, కేబినెట్ హాల్‌లో చప్పట్లు

చంద్రబాబు పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశం: అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి ముందు కేబినెట్ హాల్ వద్ద ఆహ్లాదకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ విజయం నమోదు చేయడంతో మంత్రుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలోకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకరికొకరు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి హాల్‌లోకి అడుగుపెట్టారు. చంద్రబాబు.

చంద్రబాబు పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశం, NewzFast Telugu (అమరావతి, ఆంధ్రప్రదేశ్): అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి ముందు కేబినెట్ హాల్ వద్ద ఆహ్లాదకరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ విజయం నమోదు చేయడంతో మంత్రుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలోకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకరికొకరు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు.

అనంతరం ఇద్దరు నేతలు కలిసి హాల్‌లోకి అడుగుపెట్టారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోపలికి రాగానే మంత్రులంతా ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఘన స్వాగతం పలికారు. మంత్రుల హర్షధ్వానాలతో కేబినెట్ సమావేశ మందిరం మార్మోగిపోయింది.

ఎన్నికల్లో కూటమి అద్భుతమైన స్ట్రైక్ రేట్ సాధించిందంటూ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ‘హిట్ కొట్టాం’ అంటూ ఉత్సాహంగా నినదిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల విజయోత్సాహం నడుమ ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. పారిశ్రామిక ప్రగతి, కొత్త పెట్టుబడుల సాధన, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు దాదాపు 30కి పైగా అంశాలు ఈ భేటీ అజెండాలో ఉన్నాయి.

కీలక పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు