ఐటీడీఏ చొరవతో చెంచు విద్యార్థినికి ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఉన్నత విద్యకు మార్గం సుగమం

చెంచు విద్యార్థిని ఎస్తేరమ్మ: విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే ఆశయంతో కష్టపడి చదివిన ఆదివాసీ చెంచు విద్యార్థినికి చివరకు న్యాయం జరిగింది. ప్రైవేటు కళాశాల యాజమాన్యం వద్ద నిలిచిపోయిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటీడీఏ అధికారుల చొరవతో ఆమె తిరిగి పొందింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పదరా మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన మల్లె ఎస్తేరమ్మ, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మీనా ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ విభాగంలో బీటెక్ విద్యను అనేక కష్టనష్టాలకోర్చి పూర్తి చేసింది. అనంతరం ఉన్నత విద్యను.

చెంచు విద్యార్థిని ఎస్తేరమ్మ, NewzFast Telugu (నాగర్‌కర్నూల్, తెలంగాణ): విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే ఆశయంతో కష్టపడి చదివిన ఆదివాసీ చెంచు విద్యార్థినికి చివరకు న్యాయం జరిగింది. ప్రైవేటు కళాశాల యాజమాన్యం వద్ద నిలిచిపోయిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటీడీఏ అధికారుల చొరవతో ఆమె తిరిగి పొందింది.

నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పదరా మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన మల్లె ఎస్తేరమ్మ, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మీనా ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ విభాగంలో బీటెక్ విద్యను అనేక కష్టనష్టాలకోర్చి పూర్తి చేసింది. అనంతరం ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని కళాశాల యాజమాన్యాన్ని కోరింది.

అయితే, తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉందని, విద్యార్థి చెల్లించాల్సిన రూ.50,426 ఫీజు చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన విద్యార్థిని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కన్వీనర్ వెంకటేష్ ప్రభాత ఉదయం పత్రికను ఆశ్రయించింది.

ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో అచ్చంపేట రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన సలోని చాబ్రా విద్యార్థిని సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. వెంటనే స్పందించి ఐటీడీఏ ద్వారా కళాశాల యాజమాన్యానికి రూ.50,426 ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకున్నారు.

దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థినికి ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేసింది.

సర్టిఫికెట్లు చేతికి అందడంతో ఆనందం వ్యక్తం చేసిన ఎస్తేరమ్మ, సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సబ్ కలెక్టర్ సలోని చాబ్రాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇదే తరహాలో గత 15 రోజుల క్రితం అమ్రాబాద్ మండలం కొమ్మం పెంటకు చెందిన వెంకటలక్ష్మి అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో బైపిసి విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.

ఫీజు బకాయి ఉందనే కారణంతో సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె చదువులు నిలిచిపోయి, తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయం కూడా సబ్ కలెక్టర్ దృష్టికి రావడంతో ఆమె ప్రత్యేక చొరవ తీసుకుని ఫీజు చెల్లింపు ద్వారా సర్టిఫికెట్లు ఇప్పించి, ఐటీడీఏ ఆధ్వర్యంలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు చేపట్టారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన మరో ఆదివాసీ విద్యార్థి రూ.6 వేల ఫీజు చెల్లించలేక ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితిలో ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.

ఈ విషయం కూడా సబ్ కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారని తల్లిదండ్రులు తెలిపారు.

నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల చెంచు గూడాల్లో నివసించే పేద ఆదివాసీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో అచ్చంపేట సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ సలోని చాబ్రా, అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు