వచ్చే ఎన్నికల్లో ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా రాజకీయ సన్యాసం: అనంత వెంకట్రామిరెడ్డి సవాల్

అనంత వెంకట్రామిరెడ్డి: వైసీపీ నాయకులు వెంకటన్నా అని పిలుచుకునే అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాజాగా పెద్ద సవాలే విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా విజయం దక్కించుకోరని ఆయన చెప్పారు. అంతేకాదు, ఒక్క ఎమ్మెల్యే గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. అయితే, రాజకీయాల్లో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలని పరిశీలకులు సూచిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌ను మాత్రమే వైసీపీ గెలుచుకుందన్న విషయాన్ని అనంత మరిచిపోతున్నారని వారు అంటున్నారు. ఒక్క గెలుపుతో ఇంత.

అనంత వెంకట్రామిరెడ్డి, NewzFast Telugu (అనంతపురం): వైసీపీ నాయకులు వెంకటన్నా అని పిలుచుకునే అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాజాగా పెద్ద సవాలే విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా విజయం దక్కించుకోరని ఆయన చెప్పారు.

అంతేకాదు, ఒక్క ఎమ్మెల్యే గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. అయితే, రాజకీయాల్లో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలని పరిశీలకులు సూచిస్తున్నారు.

అనంతపురం కార్పొరేషన్‌ను మాత్రమే వైసీపీ గెలుచుకుందన్న విషయాన్ని అనంత మరిచిపోతున్నారని వారు అంటున్నారు.

ఒక్క గెలుపుతో ఇంత భారీ సవాల్ చేయాల్సిన అవసరం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అనంతపురంలో టీడీపీ పోటీ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని కూడా వారు చెబుతున్నారు.

పైగా, గత ఎన్నికల్లో అనంతపురంలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీ దక్కించుకోలేదన్న వాస్తవాన్ని ఆయన మరిచిపోతున్నారా అనే సందేహం వ్యక్తమవుతోంది.

నిజానికి అనంతపురంపై టీడీపీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినప్పటికీ కార్పొరేషన్‌ మాత్రమే వైసీపీ దక్కించుకుంది.

ఇది మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో కార్పొరేట్ స్థానాలను నెగ్గించుకోలేకపోయింది. దీనిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు.

అప్పటి పరిస్థితులు, పరిణామాలు భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు.

గత ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రకటనలు, సవాళ్లు చేసిన నాయకులు అడ్రస్ లేకుండా పోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. టీడీపీ నేతలకు ఒక లక్షణం ఉందని, తమను రెచ్చగొడితే మరింత పట్టుదలతో పనిచేస్తారని వారు అంటున్నారు.

గతంలో ఇదే జరిగిందని కూడా చెబుతున్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు, పైగా సీనియర్ నాయకుడిగా ఇలాంటి సవాళ్లు చేయడం తగదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. పార్టీ పరంగా మరింత పుంజుకోవాల్సిన అవసరాన్ని తాజా ఎన్నికలు చాటిచెబుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగకపోతే ఇబ్బందులు తప్పవని కూడా వారు సూచిస్తున్నారు.

ఇప్పుడు కావాల్సింది సవాళ్లు కాదని, ప్రజలకు మేలు చేసేలా పార్టీని వారికి చేరువ చేసే పటిష్ఠమైన ప్రణాళికలు, వ్యూహాలేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. ఆ దిశగా ఆలోచన చేయాలని సూచిస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు