ధరలు పెరిగినా జమ్మికుంట మార్కెట్‌లో పత్తి వ్యాపారం సగానికి పైగా తగ్గింది

జమ్మికుంట పత్తి కొనుగోళ్లు: పత్తి ధరలు పెరిగినా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్లు మాత్రం గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి వ్యాపారం సగానికి పైగా పడిపోయింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సెప్టెంబరు 23న ప్రారంభమైన పత్తి కొనుగోళ్లకు నేటికి 47 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రైతులు యార్డులో 21 వేల క్వింటాళ్లు విక్రయించగా, జిన్నింగ్ మిల్లులు, బీ టైప్ వ్యాపారుల గోదాముల్లో నేరుగా మరో 10 వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగాయి. మొత్తంగా 31 వేల క్వింటాళ్ల పత్తి వ్యాపారం.

జమ్మికుంట పత్తి కొనుగోళ్లు, NewzFast Telugu (జమ్మికుంట, కరీంనగర్): పత్తి ధరలు పెరిగినా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్లు మాత్రం గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి వ్యాపారం సగానికి పైగా పడిపోయింది.

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సెప్టెంబరు 23న ప్రారంభమైన పత్తి కొనుగోళ్లకు నేటికి 47 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రైతులు యార్డులో 21 వేల క్వింటాళ్లు విక్రయించగా, జిన్నింగ్ మిల్లులు, బీ టైప్ వ్యాపారుల గోదాముల్లో నేరుగా మరో 10 వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగాయి.

మొత్తంగా 31 వేల క్వింటాళ్ల పత్తి వ్యాపారం జరిగింది.

గతేడాది ఇదే సమయానికి 83 వేల క్వింటాళ్ల కొనుగోళ్లు జరగడం గమనార్హం. అంటే ఈసారి 52 వేల క్వింటాళ్ల కొనుగోళ్లు తగ్గాయి.

గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ పత్తికి 7,250 నుంచి 7,600 రూపాయల వరకు ధర పలికింది. ఈసారి గరిష్ఠంగా 9,250, కనిష్ఠంగా 8,350 రూపాయల ధర లభించింది.

గతేడాదితో పోలిస్తే కనిష్ఠ ధరలో 1,100, గరిష్ఠ ధరలో 1,650 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తోంది. అయినా కొనుగోళ్ల పరిమాణం 62 శాతం తగ్గింది.

గతేడాది సగటు ధర 7,425గా తీసుకుంటే 83 వేల క్వింటాళ్ల పత్తికి 61.62 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈసారి సగటు ధర 8,800 రూపాయలుగా తీసుకుంటే 31 వేల క్వింటాళ్లకు సుమారు 27.28 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్ల పరిమాణం తగ్గడంతో వ్యాపార విలువ 34.34 కోట్లు తగ్గింది. వ్యవసాయ మార్కెట్‌లో ఒక శాతం మార్కెట్ ఫీజు ప్రకారం మార్కెట్ కమిటీకి 47 రోజుల క్రయవిక్రయాల్లో 27.28 లక్షల ఆదాయం సమకూరనుంది.

గతేడాది 61.57 లక్షల ఆదాయం సమకూరింది. మార్కెట్ ఫీజు ఆదాయ అంచనా 34.29 లక్షలు తగ్గింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు