ప్రతి చుక్క నీటికీ లెక్క.. ‘ధారా’తో బిల్లు పక్కా

ధారా స్మార్ట్ వాటర్ మీటర్: ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ నగరంలో శీతాకాలానికే నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రభుత్వ నీటి సరఫరా లెక్కలు కూడా మారాయి. దీంతో అపార్ట్‌మెంట్లలో వృథాను అరికట్టాలంటూ బోర్డులు వెలుస్తున్నాయి. బోరుబావులు అడుగంటుతుండటంతో అపార్ట్‌మెంట్లలో నీటి వినియోగంపై వివాదాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టుకు పక్కాగా లెక్క తేల్చుతామంటూ కృత్స్నం సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం అల్ట్రాసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్‌ను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభమైన స్టార్టప్‌. ఇప్పుడు నగరంలోనే.

ధారా స్మార్ట్ వాటర్ మీటర్, NewzFast Telugu (హైదరాబాద్): ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ నగరంలో శీతాకాలానికే నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రభుత్వ నీటి సరఫరా లెక్కలు కూడా మారాయి.

దీంతో అపార్ట్‌మెంట్లలో వృథాను అరికట్టాలంటూ బోర్డులు వెలుస్తున్నాయి.

బోరుబావులు అడుగంటుతుండటంతో అపార్ట్‌మెంట్లలో నీటి వినియోగంపై వివాదాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టుకు పక్కాగా లెక్క తేల్చుతామంటూ కృత్స్నం సంస్థ ముందుకు వచ్చింది.

ఇందుకోసం అల్ట్రాసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్‌ను తెరపైకి తెచ్చింది.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభమైన స్టార్టప్‌. ఇప్పుడు నగరంలోనే సొంతంగా స్మార్ట్ వాటర్ మీటర్లను తయారు చేస్తోంది.

వ్యవస్థాపకులు శ్రీహర్ష, వినయ్ చాటరాజు, పృథ్వీ సాగర్ అనగాని, నీరజ్ కుమార్ రాయ్ ‘ధారా’ ప్లాట్‌ఫామ్ ద్వారా నివాస సముదాయాలు, పరిశ్రమల్లో నీటి వాడకంపై స్పష్టమైన డేటాను అందిస్తున్నారు.

రోజూ ఉదయాన్నే కిందటి రోజు ఏ ఫ్లాట్ ఎంత నీరు వాడిందో ‘ధారా పల్స్’ ద్వారా నేరుగా వాట్సాప్‌కే వివరాలు వస్తాయి. ఈ మీటర్లు ప్రతి గంటకు నీటి ప్రవాహాన్ని లెక్కిస్తాయి.

ఫ్లష్‌లు, ట్యాప్‌ల నుంచి చుక్కలుగా కారే నీటిని కూడా గుర్తించి, ఎక్కడ వృథా జరుగుతుందో కచ్చితంగా పసిగడతాయి.

4జీ సిమ్‌తో పనిచేసే ఈ మీటర్ బ్యాటరీ ఐదేళ్లపాటు పనిచేస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా మీటర్లు బిగించినట్లు సంస్థ పేర్కొంది.

వృథాను తగ్గించడం ద్వారా అపార్ట్‌మెంట్ల నిర్వహణ భారం కొంతమేరకైనా తగ్గుతుందని భావిస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు