సూర్యాపేట రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (సూర్యాపేట, తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ శివారులో శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో మీసాల చిన్న పిచ్చయ్య, మీసాల లోకేశ్వరి దంపతులు ఉన్నారు.
పెన్పహాడ్ మండలంలోని అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందిన ఈ దంపతుల్లో లోకేశ్వరి సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం లోకేశ్వరి తన భర్తతో కలిసి బైక్పై స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో సూర్యాపేటకు చెందిన చింత లోకేశ్ అనంతారంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి బైక్పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో ఇరు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో చిన్న పిచ్చయ్య, లోకేశ్వరి, చింత లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.




