దాయిరా ఓటీటీ స్ట్రీమింగ్, NewzFast Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘దాయిరా’ ఇప్పుడు డిజిటల్ ఓటీటీలోకి రానుంది.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. 2019లో జరిగిన హైదరాబాద్ దిశా రేప్ కేసు, ఎన్కౌంటర్ సంఘటనల స్ఫూర్తితో, కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జితేంద్ర జోషి, కన్వల్జీత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 18న హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్ర డిజిటల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం.


