పీఎం అజయ్ పథకం సర్వే, NewzFast Telugu (ఉప్పునుంతల మండలం): ప్రధానమంత్రి అనుసూచిత జాతుల అభ్యుదయ యోజన (పీఎం అజయ్) పథకం కింద ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి, మామిళ్లపల్లి, దాసర్లపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి.
ఈ పథకం అమలులో భాగంగా మామిళ్లపల్లి గ్రామంలో శనివారం సర్పంచ్ ముకురాల మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల బృందం సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్, గ్రామంలోని ప్రతి కుటుంబం సర్వేలో తప్పనిసరిగా పాల్గొని తమ పూర్తి వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సర్వేకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పానం సైదులు, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, హరిప్రసాద్, సురేష్, ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.

