రేగొండ రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (జయశంకర్ భూపాలపల్లి జిల్లా): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాలకుర్తి తిరుపతి (37) అక్కడికక్కడే మృతి చెందాడు.
గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన తిరుపతి పరకాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటికి బైక్పై వెళ్తుండగా, భూపాలపల్లి వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ చెక్పోస్ట్ వద్ద బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో తిరుపతి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
